ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

జీవమును ఇచ్చు ఆత్మ యొక్క నియమము గొప్ప విముక్తి! మనము పాపం మరియు మరణం యొక్క చట్టం నుండి విముక్తి పొందాము. యేసు పునరుత్థానం వల్ల మరణానికి మనపై అధికారం లేదు. సిలువపై పాపానికి యేసు మన ఋణాన్ని తీర్చినందున పాపానికి మనపై ఎటువంటి దావా లేదు. మన శక్తిమంతమైన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన పని వల్ల మనం దేవుని ముందు ఆయన నీతిమంతులుగా నిలబడతాము. మన భవిష్యత్తులో శిక్ష లేదు, మహిమ మాత్రమే!

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన దేవా, నా విమోచన క్రయధనాన్ని చెల్లించడానికి మరియు పాపం మరియు మరణం నుండి నన్ను విముక్తి చేయాలనే మీ ప్రణాళికకు ధన్యవాదాలు. యేసు ద్వారా నాకు ఇచ్చిన మీ సాటిలేని కృప వల్ల నాకు ఉన్న విశ్వాసానికి ధన్యవాదాలు, ఆయన పేరున నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు