ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుడు ఇచ్చే అనేక బహుమతులలో, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనలో ఉంచిన ఆయన ఉనికి అనే బహుమతి చాలా విలువైనది. ఆత్మ ఉనికి మనలను దేవుని ఆలయంగా చేస్తుంది (1 కొరిం. 6:19). మనం ప్రార్థించేటప్పుడు దేవుని చిత్తానికి అనుగుణంగా ఆత్మ మన కోసం మధ్యవర్తిత్వం చేస్తుంది (రోమా. 8: 26-27). మన శరీరం మనలను లాగుతున్నపుడు ఆత్మ మనకు సహాయపడుతుంది (రోమా. 8: 13-14). ఆత్మ మన అంతరంగంలో బలాన్ని ఇస్తుంది (ఎఫె. 3:16). మరో మాటలో చెప్పాలంటే, క్రీస్తు స్వరూప్యములోనికి మనలను మార్చడానికి ఆత్మ పని చేస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఆయన పవిత్ర ఉనికికి దేవునికి కృతజ్ఞతలు తెలియజేద్దాం.

నా ప్రార్థన

తండ్రీ, నేను ప్రార్థిస్తున్నప్పుడు ఇప్పుడు కూడా నా కోసం మధ్యవర్తిత్వం చేస్తున్న మీ పరిశుద్ధాత్మకు చాలా ధన్యవాదాలు. నేను మీకు అంకితమైన పవిత్ర జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దయచేసి మీ ఆత్మ ద్వారా నన్ను బలోపేతం చేయండి. ప్రియమైన తండ్రీ, వ్యక్తిత్వం మరియు కరుణతో మీ కుమారుడిలాగా ఉండటానికి మీ ఆత్మ ద్వారా నన్ను మార్చాలని నా హృదయ కోరిక. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు