ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఈ వాక్య భాగం నిజముగా నన్ను :"ఓ దేవా మమ్ములను తిరిగిరప్పించండి, తిరిగిరప్పించండి అని దేవునికి ఎలుగెత్తి ఏడ్వాలినిపించేలాగా చేసింది. మీ ప్రజలను అనగా ఎవరైతే తమ అద్భుత భావనను కోల్పోయారో వారిని తిరిగిరప్పించండి.మా వాడిన హృదయాలను తిరిగి వాటి నిర్దోషత్వపు స్థితికి తీసుకురండి. తిరిగి మా జీవములను నిష్కళంకమైన సంపూర్ణత మరియు ఆలోచనావిధానమునకు తిరిగిరప్పించండి. ఓ సర్వోన్నతమైన దేవా మా అందిరిని తిరిగి మీ వద్దకు తిరిగిరప్పించండి !అందరు క్రైస్తవులు ఆమె లేదా అతని అద్భుతభావనను కోల్పోనకుండగా మరియు మాలో ప్రతివారు వాడిన హృదయాలను కలిగియుండకుండగా మా అందిరిని నూతనపరచుటకు మరియు మా పై ప్రకాశించుటకు మా అందరికి మీ ప్రత్యక్షత కావాలి.

నా ప్రార్థన

ఓ దేవా నూతనమైనవాటిని సృజించువాడా విషయాలు కొన్నిసార్లు నేను పాతగిలిపోయాను ,మరియు చిరిగిపోయినవాడను అనిపిస్తుంది .నా ఆత్మ పోరాడుతూ అలసిపోతుంది. నన్ను మీరు తిరిగిరప్పించుటకు మీ ఉనికి మరియు శక్తి నాకు అవసరం. దయచేసి నన్ను మీ వైపుకు తిరిగి తీసుకొని, మీ దయను నాలో జీవివించునట్లు చేయండి . దయచేసి మీ ప్రేమకు నన్ను తిరిగి చేర్చండి మరియు నా ద్వారా ఇతరులతో ఆ ప్రేమను పంచండి . ఇతరులు నాలో నీ గుణాలక్షణాలను చూచునట్లు దయచేసి నీ నీతికి నన్ను తిరిగిరప్పించండి. దయచేసి నన్ను పునరుద్ధరించుము, మరియు నన్ను మాత్రమే కాదు, లోకము మాలో నిన్ను చూచి నీ కృపను యెరుగునట్లు మీ నామమున ఎలుగెత్తి మొరపెట్టువారందరిని తిరిగిరప్పించండి.యేసు నామమున అడుగుచున్నాము.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు