ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మన పరిశుద్ధ దేవునిపై మనము లోతైన మరియు పూజింపదగినంత గౌరవం కలిగియున్నప్పుడు, అతను ప్రేమించే వాటిని ప్రేమిస్తాము మరియు అతను ద్వేషించే వాటిని ద్వేషిస్తాము. అయితే, "ద్వేషము" అనే పదం వాక్యభాగములలో చాలా జాగ్రత్తగా వాడబడుతుందని మనము గుర్తించాలి. ఈ బలమైన క్రియా పదము తరచుగా ఉపయోగించబడదు, మరియు అది దేవుని విషయములో ఉపయోగించినప్పుడు, దేవుడు ద్వేషించు వస్తువును మాత్రమే మనం గమనించవలసిన అవసరం ఉంది.దేవుడు అహంకారమును ద్వేషిస్తాడు,అది ఈ ప్రత్యేక సందర్భములో అహంకారం, ￰గర్వము, దుష్ట ప్రవర్తన, మరియు చెడ్డమాటలు వంటివిగా గుర్తించబడినది .ఇవి క్రైస్తవులు విసర్జించవలసిన విషయాలు మాత్రమే కాదు కానీ , అసహ్యించుకొనవలసినవి కూడా. దేవుడు తన ప్రజలు వ్యక్తిత్వం కలిగిన ప్రజులుగా మానవత్వం, నైతిక ప్రవర్తన, మరియు ఉపయోగకరమైన వాక్కు కలిగిన ప్రజలుగా ఉండాలని కోరుకుంటున్నారు.

నా ప్రార్థన

ఓ పరిశుద్ధ మరియు నీతిమంతుడవైన తండ్రీ, నా గర్వము,స్వార్ధమును బట్టి నన్ను క్షమించండి . నా అహంకారం మరియు మోసపూరిత నాలుకను బట్టి నన్ను క్షమించు. పవిత్రంగా ఉండటానికి , అక్కరలో ఉన్నవారికి దయను చూపటానికి ,చెడు నుండి విముక్తి పొందనట్లుగా మీ ఆత్మ ద్వారా నన్ను పునఃనిర్మించండి. యెహోవా, ఇప్పటికీ మరియు ఎప్పటికీ శాశ్వితకాలంలో నా జీవితంలో మరియు సంఘములో నీకు మహిమ కలుగుగాక . యేసు నామములో అడుగుచున్నాము . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు