ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

యేసు గురించిన కొన్ని ప్రాథమిక, ఉన్నతమైన వ్యాఖ్యానాలు 1 & 2 తిమోతి, తీతులలో చేయబడినవి. క్లిష్టమైన ప్రదేశాల్లో పరిచారకులు, పరిణితి చెందిన సంఘాలకు సహాయం చేయడానికి ఈ లేఖలు తోడ్పడుతాయి . అవి చాలా ఆచరణాత్మకంగా ఉన్నాయి, అంతేకాక యేసుని పనిలో ,ఆయన ఆత్మా,మరియు ఆయన దైవత్వం లో కూడా ఈ లేఖలు పాతుకుపోయి ఉన్నాయి. నమ్మకమైనవాని కోసం నిరీక్షిస్తున్నాము ! మనలను విమోచించడానికి బలి అర్పించినందున అతను మన కొరకు వస్తాడని మనము నమ్ముతున్నాము . మనం అయన కొరకు వేచిచూస్తూ , ఆయన మన ప్రభువు అని మన జీవితాల్లో కనపరుస్తూ మేలైనది చేయాలనే ఉత్సాహంగల ప్రజలముగా ఆయన పనిని గౌరవించుదాము.

నా ప్రార్థన

ఓ దేవా నాకు నేను యేసుని కొరకు ఎదురుచూచుచున్నవానిగా కనపడుచున్నాను . అతను నాకొరకు వస్తున్నాడు కాబట్టి, నా జీవితం చాలా పొడవుగా, కష్టంగా, మరియు నిష్ఫలముగా ఉండే ఆ రోజుల్లో కూడా నా జీవితానికి దిశానిర్దేశం మరియు అర్థం ఉన్నదని నాకు తెలుసు. యేసు మహిమతో కూడిన ప్రత్యక్షత కోరకు వేచి ఉండునట్లుగా నా హృదయాన్ని కదిలించండి , కేవలము మంచిది మరియు పరిశుద్ధమైన వాటిని మాత్రమే కావాలని కోరుకునే విధముగా నా కోరికలు ఉండునట్లు నన్ను కదిలించండి.నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను! కానీ, ప్రియమైన ప్రభువా, నేను కూడా నీ లాగే ఉండునట్లుగా ఎదురుచూచుచున్నాను యేసు మహిమకరమైన నామమున నేను ప్రార్ధిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు