ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

క్రైస్తవులు పరిపూర్ణులు కాదు; వారు కేవలం క్షమింపబడినవారు . " మనం పరిపూర్ణులము కాదని మనకు తెలుసు. మన బలహీనతలు, అనర్హత ,అపవిత్రత ,అల్పత్వము అపరిపక్వత, పిరికితనం మనకు తెలుసు... కాని యేసు సిలువపై మనయెడల తనకున్న ప్రేమను ప్రదర్శిస్తూ తన శరీరాన్ని అర్పిస్తూ తన రక్తాన్ని చిందింపజేశాడు. ఆయన త్యాగం అనగా దేవుడు మనలను "పరిపూర్ణులు "గా చూస్తాడు అని అర్ధం . యేసు బలి అంటే మనం పరిశుద్ధులము , కళంకములేని వారము దేవుని సన్నిధిలో శిక్షించబడు అపరాధభావము లేకుండా ఉన్నామని అర్ధం ! యేసుని పరిపూర్ణ బలి దేవునికి మనకును మధ్య పరిపూర్ణ సమాధానమును తెచ్చిపెట్టేను.

నా ప్రార్థన

నా పాపములను బట్టి నన్ను క్షమించండి సర్వోన్నతమైన దేవా.సర్వశక్తిగల దేవా, నా పాపముల నిమిత్తము నన్ను క్షమించు. వాటివలన నేను జబ్బు నొంది వాటిని పూర్తిగా అధిగమించలేని నా సొంత అసమర్థత వల్ల విసుగు చెందాను. ప్రియమైన తండ్రి , ధైర్యసాహసాలను కలిగి పౌరుషముతో విజయవంతముగా శోధనలను ఎదురుకొనునట్లు నన్ను బలపరచండి. మీరు యేసును పంపూట ద్వారా మీ పరిపూర్ణత మరియు మహిమ పంచుకున్నందుకు, మహిమగల దేవా నీకు కృతజ్ఞతలు .నన్ను నీ బిడ్డనుగా చేసికొనిన దేవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నిన్ను స్తుతిస్తున్నాను! ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేను ప్రార్ధిస్తున్నాను. ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు