ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

సిలువ దాని ప్రాథమిక మరియు మూల రూపంలో చూసినప్పుడు అది ఒక ప్రమాదకర చిహ్నం. దేవుడు శరీరధారిగా మారి మన మధ్య జీవించడం నమ్మశక్యం కానిదిగా వుంది . దేవుడు మరణాలు మరియు మానవ అవసరాల యొక్క మార్పులకు మరియు కఠినతకు లోబడి ఉండటం అనేది ఊహించలేము. దేవుడు సిలువ యొక్క ఉగ్రత మరియు అమానవీయతలను భరించడం ప్రవర్తనాత్మకమైనది. కానీ, అది సువార్త. మూర్ఖంగా, బలహీనంగా మరియు అప్రియంగా కనిపించేదియైనను మనలను తిరిగి తయారుచేసే శక్తిని కలిగి ఉంటుంది మరియు అసమానమైన విశ్వాసానికి ప్రేరేపిస్తుంది. మనము యేసు సిలువ మరియు పునరుత్థానానికి వచ్చినప్పుడు, మన కొరకు మరియు మనలో దేవుని దయ ద్వారా సాధించిన అసాధ్యమైనదాని వద్దకు మనము వస్తాము. దేవుడు మాత్రమే మనకు విమోచనను తెస్తాడు.

నా ప్రార్థన

పవిత్రమైన మరియు దయగల తండ్రి, సిలువ కొంతమందికి వెర్రితనము అని నాకు తెలుసు. సిలువను చిహ్నంగా ధరించే చాలా మంది ప్రజలు దానిని గౌరవించరని నాకు తెలుసు. అయితే తండ్రీ, నా కోసం సిలువకు వెళ్ళడానికి యేసు అంగీకరించడం శక్తివంతంగా మరియు అద్భుతంగా నమ్మకమును ఇస్తుందని నేను అంగీకరిస్తున్నాను. ప్రేమ మరియు దయ యొక్క త్యాగం యొక్క ఈ బహుమతికి ధన్యవాదాలు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను . ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు