ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఈరోజు మీరు దేనికొరకు వెతుకులాడుచున్నారు ? మేలైనదానికొరకు వెతుకుచున్నారా? పగను పెంచి పోషించుట ద్వారా , పుకారులను వ్యాపించుట ద్వారా లేదా కామమును పోషించుట ద్వారా కీడును వెంబడించుచున్నారా?.దేవుడు మనతో కూడా ఉండాలని ఎదురుచూచుచున్నాడు,మనలను ఎన్నడూ విడువనని ఆయన మనకు వాగ్దానము చేసెను.కానీ దేవుడు ఎక్కడికివెళ్తాడో అక్కడికి వెళ్లునట్లు ఆయనను , మరియు ఆయన స్వభావం ,ఆయన నీతి మరియు ఆయన మంచితనము అనేవి తప్పక వెంబడించవలసినవి.

నా ప్రార్థన

ప్రేమగల మంచి తండ్రి, మంచితనము ఎలాగూ ఉండునో క్రీస్తును పంపుట ద్వారా కనుపరచినందుకు నీకు కృతజ్ఞతలు. మేలైన ఆత్మీయ ఫలములు ఫలించునట్లు నన్ను నీ ఆత్మతో నింపినందుకు నీకు కృతజ్ఞతలు.అక్కరలో వున్నవారిపట్ల మేలైన క్రియలు చేయు అవకాశం పొందునట్లు గా నన్ను క్రీస్తు శరీరములోను, మీ జనులమధ్య ఉంచినందుకు నీకు కృతజ్ఞతలు.కానీ నీవు మాత్రమే నిజమైన దేవుడవని నా లోలోతులల్లో గుర్తించాను. నా జీవితములో నీ స్వభావం , నీ మంచితనమును వెతుకుచున్న నాకు సహాయము చేయుము.యేసు నామమున ప్రార్ధించుచున్నాను ఆమేన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు