ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మీ హృదయాన్ని కాపాడునది ఏమిటి? మీ మనస్సును ఏది రక్షిస్తుంది? దేవుని శాంతి మన హృదయాలకు, మనస్సులకు కాపలాగా నిలుస్తుందని మీకు తెలుసా? ఈ వాక్యభాగములో అపొస్తలుడైన పౌలు మనకు ఇచ్చిన వాగ్దానం అది. మన అభ్యర్ధనలను కృతజ్ఞతతో, దేవునికి సమర్పిస్తే, ఏ వివరణకన్నా గొప్పది మరియు దానిని గ్రహించగల మన సామర్థ్యాన్ని మించిన దేవుని శాంతి, మన హృదయాలు మరియు మనస్సులపై కేంద్రముగా నిలుస్తుంది. ఇది ఎలా నిజమో మీకు ఉదాహరణ కావాలా? యోబు గ్రంధము చూడండి. అతనికి జరిగినదంతా చూడండి . అన్నీ అతన్ని గాయపరుస్తాయి. అయినప్పటికీ అతను కఠిన హృదయుడు కాడు లేదా పిచ్చివాడు కాడు . అతని మనుగడకు కీలకం ఏమిటి? యెహోవాతో కొనసాగుతున్న మాట్లాడుఅయన సంభాషణ . అతను ఎంత ఘోరంగా బాధించబడినా, ఎంత గందరగోళంగా ఉన్నా, ఎంత ఘోరంగా ఎగతాళి చేయబడిన అతను ఆ సంబంధాన్ని వదులుకోడు.

నా ప్రార్థన

తండ్రీ, నాకు మీ శాంతి కావాలి. నా హృదయములో గ్రుచ్చబడిన గాయాలు ఉన్నాయి, కానీ అది కఠినపడుట మరియు క్షణీణించి పోవడము నాకు ఇష్టం లేదు. నా మనస్సు చాలా గందరగోళానికి గురైన సందర్భాలు ఉన్నాయి, నేను నా హేతుబద్ధతను కోల్పోతానని భయపడుతున్నాను. ప్రియమైన తండ్రీ, నేను యేసును అంటిపెట్టుకుని, నా జీవితం మరియు నీ దయ గురించి మీతో బహిరంగంగా మాట్లాడుతున్నప్పుడు, నీ శాంతితో మీరు నన్ను ఆశీర్వదిస్తారని మరియు నా హృదయాన్ని మరియు మనస్సును విధ్వంసం నుండి రక్షిస్తారని నేను నమ్ముతున్నాను. ప్రియమైన తండ్రీ, నేను నా కష్టాలతో పోరాడుతున్నప్పుడు కూడా, నా జీవితంలో మీరు నన్ను ఆశీర్వదించిన సమస్త మంచి పనులకు మరియు మీతో నా నడకకు నేను మీకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది! యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు