ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

భిన్నమైన ప్రమాణాలతో జీవించే ప్రపంచంలో పవిత్రత కొరకైనా పిలుపును విస్మరించడం చాలా సులభం. మన జీవనశైలిని మన చుట్టుపక్కల వారితో పోల్చడానికి సాతాను మనలను ప్రోత్సహిస్తాడు. ఇతరులతో పోల్చితే మన పాపాలను మనము చిన్నవే అనుకునే విధముగా చేస్తాడు. కానీ సమస్య మన పాపాన్ని పోల్చుకోవడం గురుంచి కాదు; సమస్య పవిత్రాత్మ చేత పరిశుద్ధపరచబడి, దయ ద్వారా రక్షించబడిన కృతజ్ఞతగల హృదయమును గుర్చినది. పవిత్రత కోసం ఆత్మ పిలుపుని విస్మరించడం లేదా మన పాపన్నీ మనమే తగ్గించుకొని చూడటము దేవుణ్ణి తిరస్కరించినట్లు అవుతుంది .మన జీవితంలో పవిత్రత పట్ల మక్కువ చూపిద్దాం, ఎందుకంటే ఇది దేవుడు కోరుకునేది మరియు మనం కోరుకునేది కూడా.

నా ప్రార్థన

తండ్రీ, నా పాపం యొక్క ప్రాముఖ్యతను నీరుగార్చడానికి ప్రయత్నించినందుకు నన్ను క్షమించు. పవిత్రత పట్ల మక్కువను కలిగించడానికి మీ ఆత్మను ఉపయోగించుకోండి మరియు నన్ను రక్షించడానికి మీరు చేసిన వాటి అన్నిటికీ మిమ్మల్ని గౌరవించే విధంగా జీవించడానికి నాకు అధికారం ఇవ్వండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు