ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

కొన్ని దినములు కేవలం కఠినముగానే ఉంటాయి. మనము ఆదరించువారు మనలను గాయపరచువారైయుందురు.మన ప్రార్ధనలు పైకప్పుకు లేచి తిరిగి మన పాదాలదగ్గర పడ్డట్టుగా ఉంటాయి.కొన్నిసార్లు కోపముగా మరికొన్నిసార్లు నిరాశతో ప్రత్యేకముగా కనికరము కొరకు దేవునికి ఎలుగెత్తి ఏడ్చెదము.మనకు ఉపశమనం కావాలి, మనకు నిరీక్షణ కావాలి , తండ్రి మనకు జవాబివ్వాలి.

నా ప్రార్థన

విశ్వాసము, నీతిగల దేవా! ప్రేమగల తండ్రీ, దయచేసి నా సహాయకుడిగా వచ్చి, పాపంతో ,వ్యాధితో నిరుత్సాహంతో, అసత్యమైన స్నేహితులతో మరియు నా అవమానం మరియు నాశనం కొరకు పనిచేసే శత్రువులతో నాకు కలుగు శ్రమలనుండి నాకు ఉపశమనం కలిగించండి. నాకు నీ సహాయం కావాలి. నాకు మీ దయ అవసరం. ఓ ప్రియమైన తండ్రి, నేటి నా జీవితంలో మీ ప్రత్యక్షత మరియు శక్తిని నేను తెలుసుకోవాలి. యేసుని తియ్యని నామములో నేను ప్రార్ధిస్తున్నాను . ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు