ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనం ప్రజలను ద్వేషించకూడదని మన పిల్లలకు బోధిస్తున్నప్పుడు, అన్యాయం, చెడు, దురభిమానం మరియు బలహీనుల పట్ల దుష్ప్రవర్తనను అసహ్యించుకోవడము కూడా చేయకూడదని కూడా మనము వారికి బోధించాలి. ధనవంతులు, పేదలు, స్థానికులకు మరియు పరదేశులకు ఇరువురికి న్యాయం చేయాలని దేవుడు కోరుకొనుచున్నాడని ఆమోసు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకము చేసాడు. ఈ విషయాలలో వారు దేవుని చిత్తమును పదేపదే తిరస్కరించుట వలన అమోసు రోజులలో స్పష్టంగా సంపన్నులు మరియు అధికారం ఉన్నప్పటికిని వారి భూమిపై నాశనాన్ని తెచ్చింది.

నా ప్రార్థన

పరిశుద్ధ దేవా, మీరు అనేక దేశాల్లో అన్యాయం విషయములో చాల కోపంగా ఉన్నారని,మరియు మా ఈ ప్రపంచాన్ని ధ్వంసం చేసే జాతిపరమైన ద్వేషంపట్ల కూడా ఆగ్రహించుచున్నారని నాకు తెలుసు . దయచేసి మీ ప్రజలను, మీ సంఘమును న్యాయము , సమానత్వము, కరుణ, ప్రేమ, జాతి యొక్క స్వస్థత మరియు నిరీక్షణ వంటివి కలుగు స్థలముగా చేయండి. ఈ మంచి లోకాన్ని మొదట నా హృదయంలో ప్రారంభించి , నా చేతులతో నిర్మించడానికి నాకు సహాయము చేయండి . యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు