ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

సమయం చాలా విలువైనది- మనం మనకుటుంబం,పిల్లలు,తల్లీదండ్రులు, స్నేహితులు, మరియు క్రీస్తునందు మన సహోదరి సహోదరులతో గడిపే సమయం చాలా విలువైనది.మీరు కాలాన్ని ఎలా పెట్టుబడిగా పెట్టుచున్నారు ? ఎక్కడ పెట్టుబడి గా పెట్టుచున్నారు ?మీకు తెలుసా మనం పెట్టుబడిగా పెట్టె డబ్బు కంటే కూడా ఇది చాలా విలువైనది.సమయాన్ని ఒక్కసారి ￰కోల్పోయాము అంటే తిరిగి దానిని పొందలేము.కాబట్టి మీరు ప్రతి దినమును ప్రారంభించే ముందు ఇవ్వబడిన దానికొరకును మరియు గొప్ప మంచికొరకు సమయమును వాడుకొనువిధముగా "సమయమును ఎరుగువారగునట్లు " దేవునిని అడగండి.సమయము చాలా త్వరగా గతిస్తుంది. అది తొలి సంధ్యా నీడను పోలివున్నది,ఇది సమీపిస్తున్న చీకటిలో కలసిపోవుటకు అంత ఆలస్యము ఏమి కాదు.

నా ప్రార్థన

నిత్యుడైన తండ్రి, నేడు నాకు ఇవ్వబడిన సమయమును మేలు కొరకును ,సరైనదాని కొరకును,మంచికొరకును మరియు లాభదాయకమైనదాని కొరకు ఉపయోగించు జ్ఞానమును దయచేసి నాకు ప్రసాదించండి. నిజముగా నా సమయమును స్థిరముగా నిలుచు దాని యందు పెట్టుబడిగా పెట్టాలనుకొనుచున్నాను. ప్రతిరోజు నాకు తారసపడు, నేను కలుసుకొనే వారు నీకు సమీపముగా వచ్చునట్లు నా సమయము వారిని ప్రభావిత పరచువిధముగా దానిని వాడునట్లు నాకు సహాయము చేయండి.యేసు నామమున ప్రార్ధించుచున్నాను ఆమేన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు