ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

పన్నులు చెల్లించే సమయములో మన నుండి ఆ పన్నుల కొంకిని(భారమును) తీసివేయటం దేవునికి ఇష్టమై ఉండదా? కానీ ఆయన మనలను తన స్వభావానికి , మంచిగాను , నిజాయితిగాను ఉండుటకు పిలుచుచున్నాడు.పడిపోయియున్నను ,మరియు విడుదల అవసరమైవున్న ఈ లోకములో, మనము దేవుని పిల్లలవలె వుండాలి తప్ప లోకముచే నియంత్రించబడరాదు.అందువలన ఇతరులపట్ల మనకున్న బాధ్యతలు,కర్తవ్యాలు తప్పక గౌరవిస్తాము,ఎందుకంటే, అలా చేయుట ద్వారా మనము మన తండ్రిని గౌరవిస్తాము.

నా ప్రార్థన

పరిశుద్ధ దేవా, నా నుండి మరియు నా తోటి పౌరులనుండి ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నులను తెలివిగా ఉపయోగించునట్లు ప్రభుత్వానికి తెలివిని ప్రసాదించండి.నేడు నీకు గౌరవమును మరియు ఘనతను చూపించునట్లు నన్ను దీవించండి.తద్వారా నీ చిత్తముపట్ల నాకున్న విధేయత వ్యక్తిగతముగాను , అందరికి తెలిసేదిగాను ఉండే అవకాశం వుంది .యేసు నామమున ప్రార్ధించుచున్నాను ఆమేన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు