ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనము దేవునిని ఎల్లప్పుడు స్తుతించు విధానము, మనము మన జీవిత కాలమంతా ఆయనకు మహిమ చెల్లించుదుమని చేసిన ప్రతిజ్ఞను గౌరవించు విధానము నిజముగా చాల తేలికైన విషయాలే.మనము దానిని ఈ రోజే జరిగిస్తాము.ఎప్పటివరకైతే మనం నేడే దేవునిని మహిమపరచాలి అని ఆయనను మహిమపరుస్తామో నిత్యము మహిమపరచుట అనేది దానికదే జరుగుతుంది.కాబట్టి మీరు దేవుని నామమును అత్యున్నతమైనదిగా హెచ్చించుటకు మరియు నిత్యము ఆయనను మహిమ పరచుటకు నిర్ణయించుకొనియుండగా ఆ రీతిగా దేవునిని మహిమపరచుట ఎప్పుడు ప్రారంభమైనదో గుర్తు చేసుకొనండి: నేడే దేవునిని మహిమ పరచండి కేవలము మీ మాటలలోనే కాక మీ చేతలలోను కూడను ఆయనను మహిమపరచండి.

నా ప్రార్థన

శక్తిగలదేవా మరియు ప్రేమగల తండ్రి, ఎంతో అద్భుతమైన మరియు అసాధారణమైనవాడవైనందున నేడు, నేను నిన్ను నమ్ముచున్నానో నీకు చెప్పాలనుకుంటున్నాను. నీవు నీతిమంతుడవు, నమ్మకమైనవాడవు పవిత్రుడవు, మరియు దయగలవాడవు నీవు సున్నితమైనవాడవు, ప్రేమగలవాడవు,అయినను నీకున్న మహిమలో అద్భుతంగా ఉన్నావు మరియు బలములో సాటిలేనివాడవు . నీవు నా పాపము నుండి నన్ను విమోచించావు, నా మరణానికి మించిన నిరీక్షణ నాకు ఇచ్చియున్నావు . నీవు నా జీవితమును మంచి ప్రజలతో నింపి, నీతో కూడా ఉండుటకు ఒక ఇంటిని నాకు వాగ్దానం చేశావు. ఓ దేవా, పరీక్షించువాడును మరియు ప్రత్యర్ధి నీకు లేరు !. నీవు నా రాజువు, నా అద్భుతమైన మరియు ఘనమైన తండ్రివి. యేసు నామమున నేడు మరియు ఎప్పుడును నిన్ను మహిమ పరతును.ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు