ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనం మంచి పనులు చేసే మనుషులుగా ఉండాలి! దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు, దానిని స్వీకరించి ఇతరులకు మంచి చేద్దాం! ఈ ప్రపంచంలోని కోరికల ద్వారా బంధించబడిన వారిలా కాకుండా - ముందుకు సాగాలని, ఎవరితోనైనా కలిసిపోవాలని లేదా క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడాలని చూస్తున్న వారివలెకాక - మంచి చేయడానికి అవకాశాల కోసం వెతుకుదాం! మరియు, మనం చేసే మేలు ఇతర విశ్వాసులకు మాత్రమే పరిమితం కాకూడదు. ప్రజలందరికీ మేలు చేద్దాం మరియు ఇతర విశ్వాసులతో దేవుని ప్రేమపూర్వక దయను పంచుకుందాం!

నా ప్రార్థన

తండ్రి నిజముగా మీరు మాత్రమే మంచివారు.కానీ ఆ మంచి కొంత నేడు ,ఈ వారము మరియు మహిమతో యేసు మాకొరకు మరలవచ్చు వరకు మిమ్ములను సేవిస్తున్న మాలోను,సంఘములోను కనిపించాలని నేను ప్రార్ధన చేన్నాను. ఇతరులకు సేవ చేయటానికైన అవకాశాలకొరకు చూస్తూ వాటి విషయములో జాగ్రత్త వహించునట్లు మాకు సహాయము చేయండి.యేసు శక్తివంతమైన నామమున ప్రార్ధించుచున్నాను ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు