ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఆహా! ,నేడు సంఘమునకు 3000 మంది జనము చేర్చబడుట గొప్పగా ఉండదా? పెంతెకొస్తులో పేతురు సందేశాన్ని అంగీకరించినవారు బాప్తిస్మము పొందారు , ఆ మొదటి సంఘము యొక్క ఆరంభము ఆశ్చర్యకరమైన విస్ఫోటనం వంటి శబ్దంలా మొదలైంది.ఆ రోజుకు ముందు ,యేసు ఆరోహణం తరువాత అనేక రోజులు చేసినట్లుగానే యేసు అనుచరుల కొద్దిమంది మాత్రమే ప్రార్థించటానికి కూడుకున్నారు. కానీ యెరూషలేములో చీకటి పడటంతో, సంఖ్య 3,000 కు పెరిగింది!అపొస్తలుల కార్యములు 2 మనకు రక్షణ యొక్క సందేశాన్ని చూపిస్తున్న హాల్ మార్క్ వాక్యభాగములా నిలుస్తుంది, తెరువబడిన హృదయ స్పందన ఎలా ఉంటుంది, మరియు వెతుకుచున్న హృదయాలను రక్షణ మరియు సంఘమునకు చేర్చడానికి పరిశుద్దాత్మడు ఈ సాధారణ సందేశాన్ని ఎలా ఉపయోగిస్తున్నాడు.ఎందుకు మీరు నేడు అపోస్తుల కార్యములు 2 చదవకూడదు? పేతురు యేసు గురించి చెబుతున్నదానిని రాసుకొనండి . పేతురు ప్రజలకు రక్షించబడటానికి ఏమి చేయాలని చెబుతున్నాడో గమనించండి. సువార్త ఇప్పటికీ చాలా సులభం, కాబట్టి దానిని అధ్యయనం చేయటమే కాక దానిని పంచుదాం, మన కాలమునకు మరియు ముక్కలైన మన భూమికి క్రొత్త ఉత్తేజం కావాలని దేవునికి ప్రార్ధన చేయుచున్నాము!.

నా ప్రార్థన

పవిత్ర మరియు సర్వోత్తమ దేవా, దయచేసి నీ పరిశుద్ధాత్మను మాలోనికి ఊపిరిగా ఊదండి, మరియు మా సంఘాలకు నిజమైన ఉత్తేజమును మరియు వేలమందికి రక్షణను తీసుకురండి . యేసు నామమున నేను ప్రార్దిస్తున్నాము. ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు