ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మీరు ￰చివరిసారిగా దేవుని నిజంగా వెతుకులాడినది ఎప్పుడు ? నేను దేవుని గురించి అస్పష్టమైన వేదాంతపరమైన అంతర్దృష్టి గురించొ లేదా దేవుని గురించి మాట్లాడే బాగా అమ్ముడుపోయే మరో పుస్తకం గురించి మాట్లాడటం లేదు. మీరు తండ్రిని బాగా తెలుసుకోవటానికి మరియు అతనిని మరింతగా మహీనపరచడానికి చివరిసారి మీరు ఎప్పుడు ప్రయత్నించారు? మన హృదయాలను తెరిచి, దేవుడిని వెతకడానికి గొప్ప అన్వేషణకు వెళ్దాం.లూకా 15 లోని తప్పిపోయిన కుమారునివలె , దేవుడు మనము తన ఇంటికి రావాలని అతను ఎదురు చూస్తున్నాడు మరియు వెతుకులాడుచున్నాడు.

నా ప్రార్థన

విలువైన పరలోకపు తండ్రి , కీర్తితో గంభీరంగా, శక్తితో అద్భుతంగా, మరియు మీ ప్రేమపూర్వక ఉనికితో ఎప్పటికి దగ్గరగా, దయచేసి నా జీవితంలో లోతైన మరియు మరింత వ్యక్తిగత జ్ఞానం మరియు మీ అనుభవంతో నన్ను ఆశీర్వదించండి. పరలోకంలో నేను మిమ్మల్ని ముఖాముఖిగా చూడగలిగే రోజు వరకు, దయచేసి నన్ను మీ దగ్గరికి మరియు మరింత దగ్గరగా తీసుకోండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు