ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మీ పాదాలు ఎంత సుందరముగా ఉన్నాయి?సుందరమైన పాదాలు కలిగిన వ్యక్తులు యేసు క్రీస్తు సువార్త పంచుకొనడానికి "పంపుచున్నవారు " "వెళ్తుచున్నవారు ". రెండిటిలో మీరు ఎవరివలె వున్నారు ? మనము ఆ రెండిటిలో ఎవరైనా ఒకరివలె ఉండకపోతే,మనము అందవిహీనమైన పాదములు కలిగిన క్రైస్తవులముగా ఉన్నాము.ఇప్పుడు ఎవరైనా ఆమె లేదా అతను వారి పాదాలను గురించి అలా చెప్పాలి అని అనుకుంటున్నారా?కాబట్టి, మనము సువార్త ప్రకటనకొరకు వెళ్తున్నప్పుడు వెళ్లి వారి మద్దతు మరియు సహాయం కోసం అడగటం , లేదా వారు వెళుతున్న సమయంలో ఇతరులకు సహాయం మరియు మద్దతునివ్వడం ద్వారా ఇతర విశ్వాసులతో భాగస్వామ్య ఒప్పందాన్ని చేసుకుందాం!

నా ప్రార్థన

సమస్త దేశములలో సర్వశక్తిమంతుడైన దేవా, చాలామంది ప్రజలకు నేడు మీ కుమారుని నామము కూడా తెలియకపోవుటను బట్టి మరియు చాలా తక్కువమంది మాత్రమే ఆయనను ప్రభువుగా నమ్ముట మీ మనస్సును భాదించుచున్నదని నాకు తెలుసు. అపొస్తలుల కార్యములు పుస్తకంలోని తొలి అధ్యాయాల్లో మన సహోదర సహోదరీలు మాదిరిగానే సుందరమైన పాదాలను కలిగి ఉండాలనే కోరికను నీ పరిశుద్ధాత్మ ద్వారా మాలో కదిలించండి. సువార్త వారి రోజుల్లో వ్యాప్తి చెందినట్లు మా రోజుల్లో కూడా వ్యాప్తి చెందునుగాక ! యేసు నామములో నేను ప్రార్ధించుచున్నాను . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు