ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

కృప అనునది ఉచితముగా ఇవ్వబడిన బహుమానము,అది మనము సంపాదించేది మరియు మన యోగ్యతలను బట్టి వచ్చేది కాదు.కానీ మన స్వీయ-విధ్వంసక మరియు తిరుగుబాటు మార్గాలలో నుండి మనల్ని వెలుపలికి నడిపించని రక్షణ నిజముగా నకిలీదే.మారుమనస్సు అనేది ఎప్పుడు కూడా ఒక మార్పు.ఇది "వన్ వే" మార్గములో తప్పుగా వెళ్తున్నాము అని తెలిపే కనువిప్పులాంటిది. మనజీవితాలకు నిరాశ, విపత్తు మరియు మరణముతో పాటు మన పెదవులకు మరియు మన జీవితాలకు కూడా యేసు ప్రభువుగా ఉండని జీవితాలుగా ముగుస్తాయని తెలిపి మనలను నడిపించు ఒక గ్రహింపు వంటిది. దేవుని కృప అద్భుతమైనది అని మనకు తెలుసు, కానీ ఆయన సంకల్పం దయనీయమైనదని అని కూడా తెలుసుకుందాము.మనము తెలుసుకున్న ప్రకారం మన పాపాల కోసం ప్రాయశ్చిత్తమైన త్యాగం చేస్తూ తన కొడుకుని పంపిన తండ్రి స్వభావము ప్రతిబింబించేలా మా ప్రవర్తనను మార్చుకుందాము.

నా ప్రార్థన

ప్రేమ, కనికరంగల దేవా, మీరు నా గత పాపాల నుండి నన్ను రక్షించుకుని, నన్ను విధేయతకు పిలుచుట ద్వారా భవిష్యత్తులో వచ్చే పాపాల పర్యవసానాల నుండి నన్ను రక్షించాలనుకుంటున్నారని కూడా గ్రహించాను.నా జీవితాన్ని మీ సంకల్పం వైపుకు తిప్పుకునే విధంగా నాకు సహాయం చెయ్యండి.నేను శోధనను ఎదిరిస్తూ మీ పరిశుద్ధతను ప్రతిబింబించేందుకు మీ ఆత్మతో నన్ను బలపర్చండి.నీ రక్షణను, నీ గుణలక్షణాలను ప్రతిబింబించే ఫలాలను నా జీవములో తీసుకురండి.యేసు నామమున నేను ప్రార్ధించుచున్నాను.ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు