ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుడు సర్వాధికారం కలిగినవాడు , సర్వశక్తిమంతుడు, ఎదురులేనివాడు కాబట్టి ఆయన మనలను ఆరాధనకు, విధేయతకు పిలవడానికి ముందే ఆయన దయతో మనలను ఆశీర్వదించడానికి పదేపదే ఎంచుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అనేక ఇతర మతాలలో, వారి దేవతలు మానవుల అభిమానాన్ని పొందే ముందు వారు తమకు కట్టుబడుట , త్యాగం మరియు విధేయతను కోరుతారు. కానీ ఒక నిజమైన మరియు జీవించే దేవుడు మాత్రము దయను ప్రసాదిస్తాడు మరియు తరువాత విధేయతకు పిలుస్తాడు. మనము వేరే దేవుళ్ళను కలిగియుండరాదు అని మనలను అడగడానికి ఆయనకు హక్కు కలిగియుండుట మాత్రమే కాదు కానీ ఆయన ప్రదర్శించిన ప్రేమ మరియు అతని సాటిలేని కీర్తి కారణంగా ఆయన మన ఏకైక దేవుడిగా ఉండటానికి అర్హుడు!

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన దేవా, మీరు సమస్త గౌరవం, ఆరాధన మరియు ప్రశంసలకు అర్హులే. నా హృదయం ఎల్లప్పుడూ మీ మహిమను గౌరవించాలని మరియు మీ దయను మెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి నా ప్రేమ మరియు మీ పట్ల విధేయత ఎక్కువకాలం ఉండనిమ్ము . నేను నా ప్రేమ మరియు గౌరవంతో యేసు నామంలో దీనిని ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు