ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

కొన్నిసార్లు పాటలు, సువార్త, సాక్ష్యము , ప్రణాళికాబద్ధమైన నేతృత్వం వెళ్లలేని చోట్లకు వెళ్తాయి.పాటలు ఒక కథను చెబుతాయి, ప్రశంసను అందిస్తాయి, మరియు హృదయాన్ని తెరుస్తూ, భావోద్వేగాలను పలికించగల ఒక మొత్తముగా సత్యాన్ని హృదయం లోనికి విడుదల చేస్తాయి .పాటలు ఆత్మకు జీవాన్ని ఇస్తాయి, దేవుని చేత లోతుగా నాటబడిన ఒక ప్రాముఖ్యమైన దానిని అవి కదిలించును.మీరు స్నేహితుల చుట్టూ ఉన్నప్పుడు సువార్తతో వారిని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారు మెచ్చిన సంగీతమును వినండి.ఆ తర్వాత సరైన సమయం దొరికినప్పుడు, వారి హృదయాలను కదిలించగల ,ఎంతో బాగా వాయించగల మంచి సంగీతముతో ,గీతాలతో వారికీ సువార్త సందేశాన్ని ప్రకటించవచ్చు .దేవుడు మనల్ని మన పవిత్ర ప్రదేశాల్లో ,చర్చిల్లో మాత్రమే కాక, మన స్నేహితులతో, సంస్కృతులతో కలసి ఆయనను స్తుతించమని కోరుకుంటున్నాడు. ఇతరులు మన విమోచకుని ప్రేమ యొక్క "హృదయగీతమును" తెలుసుకునే మార్గాల్లో మనము పాడాలని ఆయన కోరుకుంటున్నాడు.

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన, నీతియుక్తమైన తండ్రీ, నిన్ను గూర్చిన కీర్తనను బహుమతిగా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు.మా హృదయాల యొక్క భావాలను మరియు మీ కృప యొక్క మాటను సంగ్రహించి, ఇతరులను విశ్వాసానికి దగ్గరగా తెచ్చునట్లు సహాయం చేసే పాటల రచయితలను బట్టి మీకు ధన్యవాదాలు.క్రైస్తవ పాటలను ప్రజల్లోకి తీసుకురావడంలో మరియు మీ మాటను ప్రజలకు మరింత అర్థమయ్యే విధంగా తయారు చేయడంలో పాల్గొన్న అందరిని ఆశీర్వదించండి.మీ సంఘములో గానం చేయటకు అధికారం ఇవ్వండి , మరియు భూమి మీద ఉన్న ప్రజలందరికీ చేరుకునే మార్గాల్లో మీ రక్షణను గూర్చి పాడుటకు మాకు సహాయపడండి.యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను.ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు