ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దయ మరియు కరుణతో ఉండండి — కొదువగా ఉన్నట్లు కనిపించే ఈ రెండు లక్షణాలు. బహుశా ఇది మనం తప్పు హీరోలను పట్టుకోవడం వల్ల కావచ్చు. దురదృష్టవశాత్తు తరచుగా ఈ రెండు లక్షణాలు బలం కంటే బలహీనతకు సంకేతాలుగా కనిపిస్తాయి. దేవుడు మనలను క్షమించినట్లు క్షమించాలంటే గొప్ప ధైర్యం మరియు గొప్ప బలం అవసరం. కాబట్టి మనం బలంగా ఉందాం!

నా ప్రార్థన

పవిత్రమైన దేవా, నన్ను క్షమించడానికి చాలా త్యాగం చేసినందుకు నేను మీకు తగినంతగా కృతజ్ఞతలు చెప్పగలిగే మార్గం లేదు. కాబట్టి ఈ రోజు, నేను మీలా మరింతగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను: నాకు అన్యాయం చేసిన వారితో మీ దయ మరియు కరుణను మరింత పంచుకుంటానని. ఈ రోజు, _____________ (మీకు గిట్టనివారి పేర్లు వ్రాయండి) పట్ల నా చేదును వదిలించుకోవడానికి నాకు సహాయం చేయమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను మరియు ఈ వ్యక్తిని మీ దయ మరియు కరుణతో ఆశీర్వదించమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. యేసునందున్న మాదిరికరమైన శక్తితో నేను ఇలా అడుగుతున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు