ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మీరు పవిత్రంగా ఉండటం ఎంత ముఖ్యమైనది? మీరు నీతిమంతులుగా ఉండుట ఎంత ప్రాముఖ్యమైనది ? దేవునితో పరిశుద్ధమైన సాన్నిహిత్యము యొక్క అనుభవాన్ని పంచుకోవటంలోని ఆనందాన్ని మరియు ఆయనికి దూరమై వైఫల్యము పొంది బాధనొందిన దావీదుకు తన హృదయాన్ని కాచుకోవటమే అతి ప్రాముఖ్యమైనదిగా వున్నది. దుర్నీతి యొక్క ఏ భాగము కూడా తనయందు ఉండటానికి ఇష్టపడలేదు ఆలాగుననే దుర్నీతి చేత తాను ఆకర్షించబడాలి అని ఏమాత్రము అనుకొనలేదు. దుర్నీతి కార్యములు చేయువారితో పాలు పంచుకొనవలెనని ఏమాత్రము అనుకొనలేదు, అతను విలాస, విందులలో పాల్గొనడానికి కూడా ఇష్టపడలేదు. దుర్నీతికి దూరముగా నుండుటకు మన నుండి దేనిని పట్టివుంచాలి అని దేవునిని అడగాలనుకొనుచున్నాము?.

నా ప్రార్థన

తండ్రీ! నీచమైన , ఘోరమైన లేదా దుర్నీతి చేత శోధింపబడనివ్వకండి. అబద్ధమును మరియు మోసపూరితమైన వాటిపట్ల పరిశుద్ధమైన ఏవగింపును కలిగించుము. దుర్నీతినీ దానీతోకూడ ఉన్న వాటిని చూసి శోధకుని యొక్క వలనుండి మరియు మీ నామమునకు మాలిన్యమును కలిగించు వాటిని చూడగలుగు స్పష్టమైన దృష్టి మరియు స్వచ్ఛమైన హృదయమును దయచేయండి. యేసు నామమున ప్రార్ధించుచున్నాను ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు