ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

సహాయము చేయటానికి కానీ ఉపకారము చేయుటకు కానీ,ప్రశంసించడానికి కానీ ప్రేమను చూపటానికి కానీ ,అభిమానించుటకు కానీ వారి యెడల ఆసక్తి కనపరచడానికి కానీ మరి దేనికైనా కానీ, మరియు వారికీ ఏది కావాలో అది ఇవ్వడానికి, వారు దేనికి అర్హులో దానిని ఇవ్వడానికి నిర్ణయాత్మకంగా యోగ్యులను ఎంచుకొనుటకు మనము ఎవరు " నెంబర్ 1" అని "చూచుటకు" బదులు మనము 'మేలైనది' పొందటానికి అర్హత కలిగినవారికొరకు మాత్రమేచూడవలెను.సత్‌క్రియలయందు ఆసక్తి గలవారమగునట్లు యేసు మనలను రక్షించెను అని పౌలు చెప్పినటువంటి ( తీతు 2:14) ప్రజలము కావలెను.

నా ప్రార్థన

తండ్రీ,నా స్వార్ధమును బట్టి నన్ను క్షమించండి. నేను తరచూ నా అవసరాలను లేదా నేను ఎలా అర్హుణ్ణి అని మాత్రమే గమనిస్తాను .నన్ను ఆశీర్వదించిన మంచివారును మరియు అర్హులైన అనేకమంది ప్రజలను మీరు నా జీవితములో ఉంచారు .నా చుట్టూ ఉన్నవారిని చూడడానికి నా కళ్ళు మరియు నా హృదయాన్ని తెరిచేందుకు మీ ఆత్మను ఉపయోగించండి , వారిని ఆశీర్వదించడానికి మరియు మిమ్మల్ని మహిమపరచటానికి, ఇతరులకు ఒక ఆశీర్వాదకరంగా వ్యవహరించడానికి నాకు ధైర్యం ఇవ్వండి. యేసు నామములో నేను ప్రార్ధన చేస్తున్నాను.ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు