ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

" నూతనమైనది మరియు మెరుగుపరచబడింది!" అనే మాట ప్రతి క్రైస్తవుడి నుదిటిపై ముద్ర వేయాలి! మనం క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు, ఆయన మనలను క్రొత్తగా చేస్తాడు మరియు మన పాపాలన్నిటి నుండి ఆయన మనలను శుభ్రపరుస్తాడు. నమ్మశక్యమైనది ఏమనగా, దేవుని దయ మరియు పరివర్తన శక్తి కారణంగా ఈ దయ "ప్రతి ఉదయం నూతనమౌతుంది" అవుతుంది. దేవుని దయ మరియు శక్తి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఇవ్వబడ్డాయి. మనము నూతన మరియు మెరుగైనవాళ్ళం, మరియు మనం యేసు లాగా పూర్తిగా రూపాంతరం చెందే వరకు ఆ విధంగానే కొనసాగుతాము! (2 కొరింథీయులు 3:18 చూడండి)

నా ప్రార్థన

పవిత్ర తండ్రీ, మీ మార్గము నా హృదయంతో, నా సంకల్పంతో, నా జీవితంతో, నా సమయంతో వుండునట్లుగా చూడండి. మీరు నన్ను క్రొత్తగా మరియు మెరుగుపరచగలిగేలా నేను మీకు కట్టుబడి ఉండాలనుకుంటున్నాను. మీరు నన్ను ఎక్కడికి తీసుకువచ్చారో నేను దానితో సంతృప్తి చెందడానికి ఇష్టపడను కానీ, ప్రియమైన తండ్రీ, నేను ఈ రోజు యేసు లాగా ఉండాలని కోరుకుంటున్నాను, మరియు నా జీవితంలో ప్రతి రోజు మీ సాధికారిక కృపకు ధన్యవాదాలు. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు