ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మలినమైన నిజ జీవితములకు సంబంధించి యదార్థముగా ఉన్నందున నేను బైబిలును ప్రేమిస్తున్నాను. మునుపటి వాక్య భాగంలో, యోహాను తన సంఘములు ఒకరికొకరు తమ జీవితాలను త్యాగము చేయటానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రత్యేకించి అది మనము చేయనవసరం లేకుండా కేవలము సిద్ధాంతముగా మాత్రమే ఉంటే బావుంటుంది అనుకుంటారు . కానీ ఈ వాక్యభాగంలోని సంఘములు ఒకరికొరకు ఒకరు త్యాగము చేసేవారిగా ఉండాలి అనే సూత్రాన్ని ప్రతిరోజు నిజజీవితములో అమలుచేసి చూపిస్తుంది : అది ఎలాగంటే మీ సంఘములో ఎవరైనా అక్కరకలిగిన వారిగావున్నారా అయితే వారికీ సహాయం చేయడానికి కదలండి ఇదే ఒకరికొరకి ఒకరు త్యాగము చేయుట యొక్క అర్ధం.

నా ప్రార్థన

పరిశుద్ధ మరియు నీతిమంతుడవైన తండ్రీ ఇతరులకు సహాయము చేయుటలో మీ హస్తాలుగాను మరియు మీ హృదయముగాను ఉండునట్లు నన్ను వాడుకొనండి , నా సంఘమనే కుటుంబములోని వారికిని మరియు ఇంకను క్రీస్తును ఎరుగని వారికును ఆశీర్వాదముగా నుండుటకు నాకు దాతృత్వమును మరియు సహనమును దయచేయండి. యేసు నామమున ప్రార్ధించుచున్నాను ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు