ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

సంపూర్ణ అధికారం ఒకనిని పూర్తిగా పాడుచేయును ఎలాగనగా మనము కలిగియుండకూడనివాటిని కలిగియుండునట్లు....మనము ఎక్కడనుండి వచ్చామో మరచిపోవునట్లుగా చేయుచు......అణచబడినవారి రోదనలు నిర్లక్ష్యము చేయునట్లుగా చేయును. సంపూర్ణ అధికారం నిజముగా ఒక మనుష్యుని పాడుచేయును,ఎందుకంటే దేవుడు మాత్రమే సంపూర్ణ అధికారాన్ని కలిగియుండగలడు. అలాంటి అధికారం మనము కలిగియుండాలనుకోవటం ఆదాము అవ్వల పాపము వంటి పాపము చేయటమే - ఇది దేవుని వంటివారు కావాలనే దురాశ .కాని నిజమైన అధికారం, సంపూర్ణ అధికారం ఆమోదయోగ్యమైన అధికారం, విరిగిపోయిన వారిని ఆశీర్వదించడానికి, దురదృష్టవంతుడిని ఎత్తివేయడానికి, నేరాన్ని క్షమించటానికి, మరియు శక్తిలేని వారికి సహాయం చేయడానికి ఉపయోగించబడుతుంది.

నా ప్రార్థన

సర్వశక్తిమంతుదడవైన, సాటిలేని దేవా, ఇతరులపై అధికారాన్ని కలిగి ఉండటం కోసం నా సమయాన్ని నేను వెచ్చించదలచుకోలేదు.దయచేసి ఇతరులను ఆశీర్వదించడానికి నాకు దయ, సామర్థ్యం, అవకాశం ఇవ్వండి- అందునుబట్టి నేను ఉన్నతమైనవాడిని లేదా ప్రాముఖ్యమైనవాడిని అని భావించాలని కాదుగాని వారు ఆశీర్వదించబడి మీ నామము మహిమ పరచబడును గాక. యేసు నామమున ప్రార్ధిస్తున్నాను.ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు