ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

పౌలు సంతోషముగా ప్రార్ధన చేసాడు.ఎందుకంటే,ఫిలిప్పీయులు ఆయనకు కేవలము సహకరించేవారు మాత్రమే కాదు కానీ ,ఆయన పనిలో భాగస్వాములు. వారి ఆర్థిక సహాయం ద్వారా ,ప్రార్ధనల ద్వారా ఆయన పట్ల ఆసక్తి కలిగి నిజముగా వారు ఆయన పనిలో పాలుపంపులు పొందారు.వారు ఒకరికొకరు భాగస్వాములు!. మనము కూడా మన సంఘము చేయు సువార్త పనిపట్ల ఆసక్తి కలిగియుందుము.సువార్త పని కొరకు ప్రార్ధన చేసి మనవంతు సహాయం చేద్దాము, ఆలాగుననే మన సంఘము ద్వారా వెళ్లి సువార్త పనిచేయు వారిని గూర్చి తెలుసుకుందాము.ఆలాగుననే ప్రపంచమంతట మన సంఘము ద్వారా సహాయము పొందుచున్న సువార్తికులను గూర్చి తెలుసుకొందాము.

నా ప్రార్థన

పరలోకంలో ఉన్న తండ్రీ, పరలోకంలో ఉన్నట్లే భూమి మీద కూడా మీ పని చేయమని ప్రార్థిస్తున్నాను.దయచేసి ఆశీర్వదించండి మరియు మీ రాజ్యం యొక్క వ్యాప్తిని శక్తివంతం చేయండి. మా సంఘముతో భాగస్వామ్యం కలిగిన వివిధ ప్రాంతాల వారిని కాపాడి, బలపరచండి .గొప్ప వనరులు, పరిపక్వత, వ్యక్తిత్వంతో వారిని ఆశీర్వదించండి.వాటిని తెలుసుకొని , ప్రోత్సహించటానికి నేను చేయగల పనులను గుర్తించునట్లు నాకు సహాయం చేయండి.యేసు నామమున ప్రార్ధిస్తున్నాను.ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు