ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

"సహోదర ప్రేమలో మరొకరికి అంకితం" కావాలంటే మన సంఘాలలో మన వాక్కు - మనం కుటుంబం, సోదరులు మరియు సోదరీమణులు, దేవుని పిల్లలు - కేవలం మాటలు చెప్పడం కంటే ఎక్కువగా ఉండాలి. మనం ఒకరి జీవితంలో ఒకరు ప్రవేశించాలి, ఒకరినొకరు తెలుసుకోవాలి, తద్వారా మనం ఒకరినొకరు సేవించుకోవచ్చు, ప్రేమించవచ్చు మరియు ఆశీర్వదించవచ్చు. మీ తోటి క్రైస్తవుల జీవితాల్లో ఎక్కువగా పాల్గొనడానికి మీరు ఇటీవల ఏమి చేసారు? ఇతరుల పట్ల భక్తిగా ఉండుట అనేది వారిని తెలుసుకోవాలనే మరియు మనము వారికి తెలియబడాలనే నిబద్ధతను అనుసరిస్తుంది!

నా ప్రార్థన

తండ్రీ, నాకు ప్రపంచవ్యాప్త కుటుంబాన్ని అందించినందుకు ధన్యవాదాలు. నన్ను పూర్తిగా ప్రేమించినందుకు ధన్యవాదాలు. తండ్రీ నాతో మరియు మీ కుటుంబంలోని వారితో నా సమయాన్ని మరింత అందుబాటులో ఉంచడంలో నాకు సహాయం చేయమని అడుగుతున్నాను. ఇతరులను దీవించుటకును మీరు మీ పిల్లలుగా చేసిన వారిచే దీవించబడునట్లుగా నాకు దహించు హృదయమును ఇవ్వండి . నా సోదరుడు యేసు ద్వారా నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు