ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఈ వాగ్దానం వెనుక అసలు ప్రశ్న చాలా సులభం: అదేమనగా నా ప్రణాళికల విజయాన్ని నేను ఎలా నిర్వచించగలను? సమాధానం కూడా చాలా సులభం: అదేమనగా మనయెడల దేవుని కృపను బట్టి ఆయనకు మహిమను తీసుకురావడం (ఎఫె. 1: 6, 12, 14 చూడండి). మన పనులను, ప్రణాళికలను దేవునికి అప్పగించడం అంటే వాటిని దేవుని చిత్తానికి అప్పగించడం (యాకోబు 4: 13-15), దేవుడు వాటి ద్వారా మహిమపరచబడతాడని విశ్వసించడం (కొలొ. 3:17), మరియు సరిగా మార్గనిర్దేశం చేయడం మన శక్తిలో లేదని గుర్తించడం(సామె. 16: 9). దేవుడు మనలను ఆశీర్వదించాలని మరియు మనకు శక్తినివ్వాలని కోరుకుంటాడు - మన స్వార్థపూరిత ఆశయం కోసం కాదు కానీ (యాకోబు 3:16), మన శాశ్వతమైన మంచి కోసం (రోమా. 8:28) మరియు దేవుని మహిమ కొరకు . యేసు మాదిరిగానే, మన ప్రణాళికలు మరియు పనులను ప్రభువుకు అప్పగించినప్పుడు, "నా చిత్తం కాదు, తండ్రీ, మీ చిత్తమే నేరవేరును !" అని చెప్పుచున్నాము.

నా ప్రార్థన

తండ్రీ, మీ సంకల్పం నా ప్రణాళికలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ మహిమ నా లక్ష్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను చేయాలనుకుంటున్న విషయాలు నా దగ్గర ఉన్నాయి. అయితే, ఈ ప్రణాళికలు మీ మహిమ కోసం కాకపోతే, ఈ ప్రణాళికలు నా కుటుంబానికి లేదా నేను ప్రభావితం చేసిన వారికి ఒక ఆశీర్వాదం కాకపోతే, దయచేసి ఆ ప్రణాళికలలో నన్ను ఓడించండి మరియు దయచేసి ఆశీర్వాదకరమైన ఇతర రంగాలవైపుకు నన్ను నడిపించండి . నేను చేసే పనిలో మీరు మహిమ పొందాలని నేను కోరుకుంటున్నాను. ఎక్కడికితే మీ దయ నన్ను నడిపిస్తుందో అక్కడికి నేను వెళ్లాలనుకుంటున్నాను . నేను నా మార్గాలు, నా ప్రణాళికలు మరియు నా పనులలో మీకు మరియు మీ మహిమకు కట్టుబడి ఉన్నాను. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు