ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుడు ఈ క్రొత్త క్రైస్తవుల జీవితాల్లో చురుగ్గా ఉండమని , తాము చేసే మంచి పనిని, తమ విశ్వాసము పట్ల తమకున్న నిబద్దతతో తాము చేసే ప్రతి మంచి కార్యాన్ని పూర్తిగా ఆశీర్వదించమని పౌలు దేవునికి ప్రార్ధించాడు .ఈ విషయములో మీరు ఏ క్రొత్త క్రైస్తవుని కోసము ప్రార్ధించడము అవసరమైవుంది?.

నా ప్రార్థన

బలశాలీ, బలవంతుడైన తండ్రీ, నేడు నా హృదయము లో ఉన్న అనేక మంది కొత్త క్రైస్తవులను దయచేసి ఆశీర్వదించండి.వారి జీవితాల్లో మీ ఉనికిని గుర్తించడానికి వారికి సహాయపడండి. వారు మీ యొక్క ప్రతి ఉద్దేశ్యాన్ని గౌరవించి మీ ప్రజలను ఆశీర్వదించడానికి వారు చేసే ప్రతి ప్రయత్నములో మంచిని అధికముచేయండి. మరియు దుష్టశక్తుల నుంచి వారిని రక్షించండి.యేసు నామమున ఈ ఆశీర్వాదము అడుగుచున్నాను ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు