ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

స్వస్థత మరియు ప్రభువు అనుగ్రహంతో వారిని ఆశీర్వదించడానికైన శక్తితో వారి మెస్సీయ వచ్చిన తరువాత ఇది తన ప్రజలకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. అనేక విధాలుగా, క్రైస్తవులుగా ఇది మన కూడా ఇవ్వబడిన వాగ్దానం . మన రక్షకుడైన ప్రభువు రాక ద్వారా దేవుడు మనలను ధర్మశాస్త్రము , పాపం మరియు మరణం నుండి విడిపించినందున మనం ఎంతో ఆనందించేదము. యేసు త్యాగం వల్ల, దేవుని పిల్లలమైన మనం క్రీస్తును ధరించాము (గల. 3: 26-27) మరియు రక్షణకు సంబంధించిన వస్త్రాలు మరియు అతని నీతికి సంబంధించిన వస్త్రాలు మనకు ఇవ్వబడ్డాయి.

నా ప్రార్థన

ప్రియమైన తండ్రీ, యేసు త్యాగం ద్వారా నన్ను నీతిమంతునిగా చేసినందుకు ధన్యవాదాలు. నాకు జీవమును ఇవ్వడానికి నా పాపాలకు మూల్యం చెల్లించినందుకు ప్రభువైన యేసు నీకు ధన్యవాదాలు. పరిశుద్ధాత్మ, నా పాపం నుండి నన్ను శుభ్రపరిచినందుకు మరియు దేవుని కొరకు జీవించడానికి నాకు అధికారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రియమైన దేవా, మీరు నన్ను సంపూర్ణంగా, పవిత్రంగా చేశారని నా చుట్టూ ఉన్నవారికి తెలిసే విధంగా నన్ను జీవించనివ్వండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు