ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

జెకర్యా తన ప్రవచనంలో ఇశ్రాయేలు యొక్క పనికిమాలిన గొర్రెల కాపరులను విమర్శించాడు. సంఘ నాయకత్వం అసాధారణమైన మరియు గంభీరమైన బాధ్యత అని మరియు గౌరవప్రదమైన వినయంతో నిర్వహించబడాలని పౌలు సంఘముల గొర్రెల కాపరులను హెచ్చరించాడు (అపో.కా 20:17-38). సంఘ నాయకులుగా మారడం ద్వారా హోదా లేదా అధికారాన్ని కోరుకునే వారి యెడల మంచి కాపరి అనగా యేసు (యోహాను 10:10-18) తన మహిమలో వచ్చినప్పుడు వారితో కఠినంగా వ్యవహరిస్తారని తెలుసుకోవాలి. దేవుని ప్రజలను దుర్వినియోగం చేసిన లేదా దేవుని మందను మేపడానికి వారి అద్భుతమైన బాధ్యతను దుర్వినియోగం చేసిన ఎవరైనా కఠినమైన తీర్పును అందుకుంటారు. అయితే, గొర్రెల కాపరిగా యేసు మాదిరిని అనుసరించిన వారికి ఉదారంగా ప్రతిఫలం లభిస్తుంది (1 పేతురు 5:1-4)

నా ప్రార్థన

ప్రియమైన గొర్రెల కాపరి, దయచేసి నిన్ను ప్రేమిస్తున్న మరియు మీ గొర్రెలను మక్కువగా చూసుకునే అర్హతగల గొర్రెల కాపరులతో మీ సంఘమును ఆశీర్వదించండి,మరియు దయచేసి నమ్మకమైన ఈ నాయకులకు మీ పట్ల మరియు మీ గొర్రెల యెడల తమ బాధ్యతలను నమ్మకంగా నిర్వర్తించేటప్పుడు మీకు దగ్గరగా ఉన్నారనే భావన మరియు మీ ఆనందాన్ని వారికి ఇవ్వండి . మా పాపాల కొరకు చంపబడిన మీ గొర్రెపిల్ల యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు