ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మీ దేశం మరియు మీ ప్రజలు పునరుజ్జీవనాన్ని అనుభవించడానికి ఖచ్చితంగా ఏది అవసరం? మొదట, ఆత్మ లేదా దేవుడు శక్తివంతమైన విధముగా కదలాలి. రెండవది, ప్రభువు వాక్యాన్ని వినడానికి మరియు ప్రతిస్పందించడానికి ప్రజలు తమ హృదయాలను తెరవాలి. కాబట్టి మన ప్రజలు ఆత్మ మరియు దేవుని వాక్యానికి తమ హృదయాలను తెరుస్తారని ప్రపంచమంతటా కలిసి ప్రార్థన చేద్దాం!

నా ప్రార్థన

పరిశుద్దా మరియు సర్వశక్తిమంతుడైన దేవా, దయచేసి పునరుజ్జీవనాన్ని తీసుకురావడానికి మా రోజులో శక్తివంతంగా కదలండి. ప్రజల హృదయాలను మీ సత్యానికి తెరిచి, మీ వాక్యాన్ని ప్రకటించేవారికి మీ సత్యాన్ని శక్తితో మాట్లాడటానికి వీలు కల్పించండి. నా చుట్టూ ఉన్నవారి జీవితాల్లో మార్పు తెచ్చేందుకు దయచేసి నన్ను ఉపయోగించండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు