ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

పాపం అనేది కొత్తేమీ కాదు. గతంలో దేవుని ప్రజల మూర్ఖత్వాలను మరియు తిరుగుబాటును చూడటానికి వాక్యపు జ్ఞానము మనలను అనుమతిస్తుంది. వారు కోల్పోయిన అవకాశాలు మరియు వారు తమ పైకి తాము తెచ్చుకున్న విపత్తుల ద్వారా మనం వారిని దోషులుగా నిర్ధారించవచ్చు. వారికి మరియు మన మధ్య ఎంత తక్కువ వ్యత్యాసం ఉందో కూడా మనకు జ్ఞాపకము చేయబడుతుంది

నా ప్రార్థన

తండ్రీ, నా పాపం, నా తిరుగుబాటు, మరియు నా నమ్మకద్రోహం ఈ రోజు నిన్ను మరియు మీ ఉద్దేశాన్ని గతంలో బైబిల్ నందు మిమ్మును బాధించినట్లుగా ప్రతిరోజూ బాధించాయని నాకు తెలుసు. మరియు నేను మీకు పవిత్రమైన మరియు మీకు నచ్చే జీవితాన్ని గడపడానికి మరియు నా చుట్టుపక్కల వారికి ఒక ఆశీర్వాదముగా ఉండునట్లు ప్రయత్నము చేయుచుండగా దయచేసి నన్ను క్షమించండి మరియు బలోపేతం చేయండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు