ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఆత్మీయ వృద్ధి తేలికగా జరగాలని మనలో చాలామంది కోరుకుంటారు అనే విషయాన్ని ఒప్పుకొందాము.శోధనను తట్టుకోగల మన సామర్థ్యం కొద్ది ప్రయత్నంతోనే జరగాలి అనుకుంటాము . పరిశుద్ధాత్మ ఆ పని చేయాలని మరియు దేవుడు మనల్ని ఎక్కువ ఒత్తిడి మరియు శ్రమ నుండి రక్షించాలని మనము కోరుకుంటున్నాము. కృతజ్ఞత చెల్లించాల్సిన విషయం ఏంటంటే దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు శక్తినిస్తాడు. ఏది ఏమయినప్పటికీ, మన జీవితాలలో ఆత్మ శక్తివంతంగా పనిచేయాలంటే, మన ఇష్టాలను ఉద్దేశపూర్వకంగా దేవునికి సమర్పించాలి మరియు మనం అపవాదిని ఎదిరించాలి. మనము అతనిపై మరియు అతని ప్రలోభాలకు వ్యతిరేకంగా పోరాడితే, అతను మన నుండి పారిపోతాడు. దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చుతాడు అని నమ్ముతూ మన వంతు కృషి చేద్దాం!

నా ప్రార్థన

తండ్రీ, నీ పరిశుద్ధాత్మ ద్వారా నాలో మీ ఉనికికి, శక్తికి ధన్యవాదాలు. మీ ఇష్టాన్ని నాకు వెల్లడించే లేఖనాలకు ధన్యవాదాలు. ఇప్పుడు, ప్రియమైన తండ్రీ,నా ఇష్టాన్ని మీ చిత్తానికి సంతోషముగా అప్పగించుకొనుచున్నాను, మీ చిత్తాన్ని నాలో జరిగించమని అడుగుతున్నాను. దయచేసి మీ ప్రజలను మరియు మీ ఆత్మను ఉపయోగించి అపవాదిని ఎదిరించడానికి నన్ను ప్రేరేపించడానికి మరియు ప్రోత్సహించడానికి మరియు మీ పట్ల నాకున్న నిబద్ధతను దెబ్బతీసే ప్రయత్నాలను గుర్తించండి. నేను దీనిని యేసు యొక్క శక్తివంతమైన నామములో అడుగుతున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు