ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

"నేను యెహోవానై యున్నానని అన్యజనులు అనేకులు తెలిసి కొనునట్లు" అనేది యెహెజ్కేలు ప్రవచనాలలో సుపరిచితమైన వాక్యభాగము . ఇక్కడ ఇది తిరుగుబాటు, పాపాత్మకం మరియు దుర్మార్గులైన తన ప్రజల విషయములో భయంకరమైనది. దేవుడు పవిత్రుడు. అతన్ని తమ దేవుడిగా చెప్పుకునే ప్రజలు ఆ కీర్తిని, గొప్పతనాన్ని బాగా ప్రతిబింభించిరి . వారు దేవుని పవిత్రతను ఘనపరిచిరి.వారు అలా చేయకపోతే, వారి మూల్యముతో దేవుడు దానిని జరిగిస్తాడు . దేవుడు దేవుడిగా తెలియబడతాడు . చాలా మంది దేవుని పేరును అపవిత్రం చేసి,వారి ప్రతిచర్యలలోను మరియు నిరాశలో ఆ నామమును వ్యర్థముగా ఉపయోగిస్తున్న రోజులో, ఇది దేవుని నామము పవిత్రమైనదని తెలియపరుచు ఒక గంభీరమైన గుర్తు. అతను తన గొప్పతనాన్ని మరియు పవిత్రతను కనపరుస్తాడు.

నా ప్రార్థన

దేవా, నేను చేయ్యవలసినంత రీతిలో మరియు నీవు పొందవలసినంత రీతిలో నిన్ను నేను గౌరవించనందుకు నన్ను క్షమించు .మిమ్మల్ని మరియు మీ పవిత్రతను ఎక్కువ అభిరుచితో మరియు లోతైన అద్భుత భావముతో గౌరవించటానికి దయచేసి మీ ప్రజలలోకి నూతన తరంగాన్ని పంపండి. మీరు పవిత్రులు, నీతిమంతులు, గంభీరమైనవారు, శక్తివంతులు, గొప్పవారు. నా జీవితంలో మరియు మాటలలో నా గౌరవాన్ని మీకు మరింత నమ్మకంగా ప్రదర్శించడానికి నాకు సహాయపడండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు