ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుడు ఒక డాలు, ఆయన వాక్యము నమ్మదగినది, మరియు మన పట్ల ఆయన మార్గం పరిపూర్ణమైనది. ఆయన మార్గం దోషరహితమైనది మాత్రమే కాక జీవమిచ్చేది కూడా. అయితే, ఆయన దోషరహితమైన వాక్యము మరియు ఆయన పరిపూర్ణమైన మార్గము మనలను ఆశీర్వదించునట్లుగా, మనము ఆయనయందు ఆశ్రయం పొందాలని ఎంచుకోవాలి, ఎందుకంటే ఆయన సన్నిధియే మనకు రక్షణ డాలుగా ఉంది. మన విధేయత, నమ్మకం మరియు ఆధారపడటం స్వచ్ఛందంగా ఆయనయందు ఉంచాలి, మరియు మన జీవితాలు ఆయన దోషరహితమైన వాక్యము ప్రకారం జీవించడానికి అంకితం చేయబడాలి. దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలము తన శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడెము.

నా ప్రార్థన

మా పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవా — మా ఆత్మలను, మా భవిష్యత్తును నీకు అప్పగిస్తున్నాము. నీవే మా బలము మరియు మా కేడెము. దయచేసి మమ్మల్ని, మా కుటుంబాలను, మరియు నీ సంఘాన్ని దుష్టుని నుండి కాపాడి రక్షించు. మా పట్ల అతని దుష్ట ప్రణాళికలను దయచేసి ఓడించు. మేము నీకు సేవ చేస్తూ, నీకు విధేయత చూపడం ద్వారా నీ నిష్కళంకమైన వాక్యాన్ని ఘనపరచడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, దయచేసి మాకు శారీరక భద్రతను, ఆత్మీయ చైతన్యాన్ని, మరియు నైతిక సచ్ఛీలతను అనుగ్రహించి ఆశీర్వదించు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు