ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

యవ్వనంగా వుండటము అంటే ఆత్రుత, అభిరుచి మరియు స్పష్టమైన ఉద్దేశ్యం కలిగియుండుట కానీ - యవ్వనము అంటే తల బిరుసు , పరీక్షించబడనివారు మరియు దురుసుతనం అని కొందరు పెద్దలు అభివర్ణిస్తుంటారు . కాలక్రమేణా నిరూపితమైన మరియు నిజమైన పద్ధతుల ద్వారా వారి వయస్సుకు సంబంధించి ఒక నానుడు ఉంది అది వారు - స్థిరమైన, ఊహించదగినవారు మరియు కదలకుండా ఉండటమే యవ్వనము అని కొందరు యవ్వనస్థులు తమను తాము వర్ణించుకుంటారు . యవ్వనస్థులకు మరియు వృద్దులకు వున్న ఈ తేడాలు ఉద్రిక్తత మరియు సంఘర్షణకు కారణమవుతాయి; అయినప్పటికీ ఈ రెండు వర్గాలవారు ఒకరినుండి నుండి మరొకరు నేర్చుకోవలసినవి ఎంతో కొంతవుంటుంది . పాత క్రైస్తవుడు ఎంత పొరపాటు చేసినా, అతడు లేదా ఆమె వారి విశ్వాస జీవితమును బట్టి వారితో గౌరవముగా వ్యవహరించాలి. కానీ పాత క్రైస్తవులు కూడా చిన్నవారి నుండి దిద్దుబాటు పొందటానికి సిద్ధంగా ఉండాలి, ప్రత్యేకించి ఒక యువ విశ్వాసి ప్రార్థనతో తన వినయం, ప్రేమ మరియు వృద్ధుల పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తే పెద్దవారు కూడా నేర్చుకొనవలసిందే.

నా ప్రార్థన

నిత్యుడగు ఓ తండ్రీ , నాపితరుల చరిత్రకు ￰కారణమైన దేవా మరియు నా భవిష్యత్ యొక్క నిరీక్షణవైన దేవా , దయచేసి చిత్తశుద్ధి గల వ్యక్తిగా ఉండటానికి నాకు సహాయం చెయ్యండి, ప్రత్యేకించి నా వయస్సులో లేని వారితో నేను వ్యవహరించేటప్పుడు,నేను పెద్దవారితో మాట్లాడేటప్పుడు ,నా స్వరములో గౌరవం మరియు జాగ్రత్తగా ఉండునుగాక . చిన్నవాళ్ళు నా లోపాలను గ్రహించినప్పుడు నేను సులువుగా మరియు మార్పుకు సిద్ధముగా ఉండునుగాక . అన్నింటికంటే, తండ్రీ, నా లోపాలను క్షమించేంతగా మరియు వాటిని నాకు చూపించడానికి మరియు వాటిని ఆధిగమించి ఎదగడానికి నాకు సహాయపడేంతగా నన్ను ప్రేమిస్తున్న వారిని దయచేసి నా జీవితంలోకి నడిపించండి . యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు