ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

పెద్దవాళ్ళును తరచూ పక్కన పడేసే యుగంలో మనం జీవిస్తున్నాం. ఉద్యోగములలో వృత్తిపరమైన ప్రపంచంలో కూడా ఇది నిజం. సంఘాలలో కూడా ఇది వర్తిస్తుంది, ఇది తరచుగా చిన్నవారైన లేదా ఆర్ధికంగా శక్తివంతులైనవారిని గురించి ఆలోచిస్తూ, వృద్ధాప్యము మరియు శక్తిలేనివారిని మరచిపోయేలా చేస్తుంది. మనలో ప్రతి ఒక్కరికి ఏమి జరుగుతుందో దేవుడు పట్టించుకుంటాడని గుర్తుంచుకుందాం. ఈ విషయంలో స్థితి లేదా ఆకారము లేదా వయస్సు పట్టింపు లేదు.

నా ప్రార్థన

సర్వశక్తిగల దేవా, నీవు నన్ను ఎన్నటికీ విడువవు, నన్ను ఎడబాపవు అని నాకు తెలుసు.క్రీస్తుయేసునందు నామీద నీకున్న ప్రేమ నుండి ఏదీ నన్ను వేరుచేయదనే వాగ్దానము నమ్ముతాను.కానీ తండ్రీ, నేను చాలా పెద్దవాళ్ళని,నిర్లక్ష్యముచేయబడినవారిని చూసినప్పుడు , నేను అలానే అంత్యదినాల్లో ఆ ఒంటరితనాన్ని, బలహీనతను ఎదుర్కోవలసి వస్తుందని భయపడ్డాను అని ఒప్పుకోక తప్పదు. నా చింతలను మీ మీద వేయటానికి, మీ ప్రత్యక్షతను నమ్మడానికి దయచేసి నాకు నమ్మకము నివ్వండి.అన్నిటికన్నా ఎక్కువగా, తండ్రీ జీవితంలో, మరణాల్లో, ఆరోగ్యములోను , అనారోగ్యములోను , యవ్వనంలో, వృద్ధాప్యములోనూ నా శరీరంలో మీరు మహిమ పరచబడాలని ప్రార్థిస్తున్నాను.యేసు మహిమాన్విత నామమున నేను ప్రార్ధిస్తున్నాను.ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు