ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

"లొంగివుండుట " అనే పదం తరచూ వ్యక్తిగతంగా మనకు ఉన్న సంబంధం పై ఆధారాపడి సానుకూలంగా లేదా ప్రతికూలంగా ఉండవచ్చు . మనకు విధేయతతో సేవ చేసేవారిని కలిగియుండటము ఎంతో ఆనందకరమైన విషయం , కానీ వేరొకరికి విధేయతతో సేవ చేయడం చాలా కష్టమే. దురదృష్టవశాత్తు, మన మార్గము దాదాపు ఎక్కువసేపు స్వార్థపూరితమైన మార్గమే . అహంకారం మరియు ఇతరులకు సేవ చేయడానికి ఇష్టపడని ఎవరినైనా దేవుడు ప్రత్యక్షంగా వ్యతిరేకిస్తాడు, ప్రత్యేకించి ఆ "ఇతరులు" పాత విశ్వాసులైతే! మన తండ్రి కోరిన దుస్తులను ధరించడం సులభం ఆయినప్పటికీ కానప్పటికీ మనం ఉద్దేశపూర్వకంగా వినయమనే దుస్తులు ధరించాలి!

నా ప్రార్థన

తండ్రీ, గ్రంధపు జాబితాలో చేర్చబడిన విశ్వాసం యొక్క గొప్ప వీరులను బట్టి కృతజ్ఞతలు . వారి ఉదాహరణలు మరియు జీవితాలను నాతో పంచుకున్న ఇతర విశ్వాస వీరులను బట్టి కృతజ్ఞతలు. బలం మరియు ఆరోగ్యంతో వారిని ఆశీర్వదించండి. మరియు తండ్రీ, దయచేసి మీ పిల్లలందరికీ, ప్రత్యేకించి మీకు మరియు మీ రాజ్యానికి నమ్మకమైన సేవలో చాలా సంవత్సరాలు జీవించిన వారిని ఆశీర్వదించడానికి మరియు సేవ చేయడానికి నన్ను ఉపయోగించండి. యేసు కృపను బట్టి , ఆయన నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

Verse of the Day Wall Art

మీ అభిప్రాయములు