ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

జీవితం , పరధ్యానంతో మరియు "చేయవలసిన పనుల'' జాబితాలతో చాలా బిజీగా ఉంది . మన "బిజీ" జీవితము మన తండ్రి "వ్యాపారం" నుండి మనలను దూరంగా ఉండనివ్వకుండా చూచుకొనండి . తనకు మరియు అతని ప్రజలకు సేవ చేయడానికి దేవుడు మనకు బహుమతిగా ఇచ్చిన మార్గాలను కనుగొందాం; అప్పుడు మన హృదయం, ఆత్మ, మనస్సు మరియు శక్తితో మనల్ని మనం ఆ మార్గాలకు అంకితం చేద్దాం

నా ప్రార్థన

దయగల దేవా, మీరు నన్ను చాలా రకాలుగా ఆశీర్వదించారు. మీ దయతో నన్ను తాకిన ఆ స్పర్శలన్నిటికి ధన్యవాదాలు. కానీ తండ్రీ, మీకు సేవ చేయడానికి మీరు నాకు ఎలాగైతే బహుమతి ఇచ్చారో వాటిని మరింత స్పష్టంగా చూడటానికి మరియు ప్రతిరోజూ నా జీవితంలో ఆ సేవను మరింత ఉద్రేకపూర్వకంగా మార్చడానికి నాకు మీ సహాయం కావాలి. నా ప్రార్థనలను ఎల్లప్పుడూ విన్నందుకు ధన్యవాదాలు. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు