ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

వేరొకరిలో తప్పు కనుగొనడం మనలో చాలా మందికి చాలా సులభం. మనలో తప్పును కనుగొనడం చాలా కష్టముతో కూడుకున్న పని . మనం ఎలా జీవించాలో ఇతరులకు చెప్పడం ప్రారంభించే ముందు మన జీవితంలోని లోపాలను, పాపాలను పరిష్కరించుకోవాలని యేసు మనకు గుర్తుచేస్తున్నాడు . చాలా సరళంగా అనిపిస్తుంది, కదా? కానీ అది కాదని మనందరికీ తెలుసు.

నా ప్రార్థన

తండ్రీ, నేను ఇతరులపై తీవ్రముగా , కఠినంగా, తీర్పు తీర్చువానిగా ఉన్నప్పుడు నన్ను క్షమించు. మీ పరిశుద్ధాత్మ యొక్క పని అవసరమయ్యే సమస్యలు నా స్వంత జీవితంలో ఉన్నాయని నాకు తెలుసు. తరచుగా మరల మరల జరిగే పాపాలు ఉన్నాయని నేను అంగీకరిస్తున్నాను, నేను మరింత ఎక్కువగా క్షమించునవిగా వున్నవి . దయచేసి, ప్రియమైన యెహోవా, నా పాపాన్ని క్షమించి, దానిని దాటి వెళ్ళడానికి నాకు అధికారం ఇవ్వండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు