ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ధర్మశాస్త్ర నీతియుక్తమైన ఆజ్ఞలను నెరవేర్చగలుగుటకు ధర్మశాస్త్రము కూడా ఇవ్వలేని రెండు బహుమతులను దేవుడు మనకు ఇస్తున్నాడు . మొదటది , మన పాపము నుండి క్షమించుటకు, పరిశుద్ధపరచుటకు మరియు మనము విమోచించుటకు ఆయన తన కుమారుడైన యేసు - అనగా పరిపూర్ణ పాపపరిహారార్థాన్ని ఇచ్చాడు. రెండవది, మనము ఉండాలని కోరుకునేలా ఉండటానికి మనకు శక్తినిచ్చేలా ఆయన తన ఆత్మను ఇచ్చాడు. ధర్మశాస్త్రం మరియు ప్రవక్తలు వాగ్దానం చేసిన వాటిని దేవుడు క్రొత్త నిబంధనలో ఇచ్చాడు . అతని ప్రణాళిక, వాగ్దానాలు మరియు బహుమతుల కోసం దేవుణ్ణి స్తుతించండి!

నా ప్రార్థన

పరలోకపు తండ్రీ, మీ విలువైన మరియు పరిపూర్ణ కుమారుడు మరియు ఆశీర్వదించబడిన పరిశుద్ధాత్మ యొక్క మీ గొప్ప మరియు పరిపూర్ణమైన బహుమతులను నాకు ఇవ్వడంలో మీ సాటిలేని దయ మరియు కృపను బట్టి ధన్యవాదాలు. యేసు నామంలో, మరియు పరిశుద్ధాత్మ మధ్యవర్తిత్వం ద్వారా, ప్రియమైన తండ్రీని నేను స్తుతిస్తున్నాను మరియు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు