ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనం మనుష్యులముగా ఎల్లప్పుడూ జీవితంలో "కోడివేరుకొని తినునట్లుగా " మన స్థానాన్ని ప్రత్యేకించి నిర్వచించడానికి ప్రయత్నిస్తున్నాము. యేసు తన శిష్యులను తన రాజ్యంలో నిజంగా భాగం కావాలంటే వారు రోజువారీ నియమాలను విసిరేయాలని గుర్తుచేసారు . వాస్తవానికి, అతను వారిపై చాలా కోపంగా ఉన్నాడు ఎందుకంటే వారు పసిబిడ్డలు తనవద్దకు రావడాన్ని ఖండించారు, ఎందుకంటే చిన్న పిల్లలను తమ బోధకుని సమయం, శక్తి మరియు శ్రద్ధకు అర్హులుకాదు అని ఈ శిష్యులు భావించారు. యేసు, తరచూ చేసినట్లుగానే , వారి ఉమ్మడి ప్రాపంచిక విలువలను తలక్రిందులుగా చేసి, వారు నిజముగా దేవుని రాజ్యమును గూర్చి అర్ధం చేసుకోవాలంటే వారు తమఫై తాము ప్రాముఖ్యత కలిగియుండుటకంటే పసిబిడ్డల వ్యక్తిత్వముపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని గుర్తుచేసారు.

నా ప్రార్థన

తండ్రీ, నన్ను మీ బిడ్డగా ఎన్నిక చేసినందుకు ధన్యవాదాలు. నేను మీ కోసం మరియు మీ రాజ్యం కోసం జీవించాలని కోరుకుంటున్నప్పుడు నాలో ఆసక్తి, వినయం మరియు విస్మయాన్ని తిరిగి మేల్కొలపండి! యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు