ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుడు దయచేయువాడు, మరియు ఉదారమైన దేవుడు. ఈ కృపలో తన పిల్లలు తనలాగే ఉండాలని అతను ఎంతో ఆశపడ్డాడు. భూమిపై మన స్థానం ఆశీర్వాదం, క్షమాపణ, సంపద మరియు అవకాశాన్ని సేకరించటము కాదు లేదా కూడబెట్టటమే కాదు కానీ మనము మన శాశ్వతమైన తండ్రి నాయకత్వాన్ని అనుసరించి, మనమే ఆశీర్వాదం, క్షమాపణ, సంపద మరియు అవకాశాలకు మార్గంగా ఉండాలి. మనము దేవునిలా ఉదారంగా ఉన్నందున, ఆయన తన పాత్రలోకి మనలను మరింతగా ఆకర్షించుకొని దానికి ప్రతిగా భవిష్యత్తులో ఇతరులకు మరింత సహాయం చేయగల మార్గాల్లో మనం ఆశీర్వదించబడ్డామని మరియు విశ్రాంతి పొందియున్నామని ఆయన రూఢిపరచుకొంటాడని మనము విశ్వసించాలి.

నా ప్రార్థన

పవిత్ర దేవా, నా జీవితాన్ని అలంకరించిన మీ ఔదార్యం యొక్క గొప్ప ఉదాహరణలన్నిటికీ నేను మీకు కృతజ్ఞతలు. ధనికస్థితి లేదా పేదరికము అయినా, మీ దయ యొక్క ఈ మార్గాలు నేను కూడా ఈ విధంగ మీలాగే ఉండగలను అని నాకు నేర్పించాయి. నా దయ, క్షమాపణ, ఆర్థిక, ప్రోత్సాహం మరియు సమయములో ఇతరులతో మరింత ఉదారంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నప్పుడు నా హృదయాన్ని నమ్మకంతో మరియు విశ్వాసంతో ఆశీర్వదించండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు