ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుడు దయగలవాడు. అవును, ఆయన అవిధేయులైన తిరుగుబాటుదారులైన తన ప్రజల విషయంలో విసుగు చెంది, కోపంగా ఉన్న ఆ మండుతున్న సందర్భాలను మనం గుర్తుంచుకుందాము. కానీ, మేము వాటిని ఖచ్చితంగా గుర్తుంచుకుంటాము ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించిన వందల సంవత్సరాలలో అవి అరుదుగా జరిగినవి మరియు ఎంతో అద్భుతమైనవి. దేవుడు తన హృదయాన్ని మనకు చూపించాడు. యోనా ఉన్నప్పటికీ దేవుడు తన దయను నినెవెకు చూపించాడు. యేసుని కరుణలో దేవుడు తన హృదయాన్ని వెల్లడించాడు. మనలను మరియు పాపులను, తన వైపుకు పిలిచి, మనకు రక్షణ కలిగించడం ద్వారా దేవుడు మీతో మరియు నాతో తన దయ మరియు ప్రేమను ప్రదర్శించాడు. అతను మన పాపం విషయంలో మార్పు లేకుంటే అయన సంతృప్తి చెందడు. అవును, అతను మనలను పశ్చాత్తాపం కోసం పిలుస్తున్నాడు . కానీ, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆకాశము మరియు భూమి యొక్క పాలకుడు విరామం ఇచ్చి మనలను దగ్గరికి ఆహ్వానించి, అతని దయను తెలుసుకోవడానికి మనకు అవకాశం ఇస్తున్నాడు అనేది నిజము అయ్యియుండటం చాలా మంచిది. అదే దేవుడు ఇతరులకు అదే దయను పంచాలని పిలుస్తున్నాడు.

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన దేవా, మృదువుగా, శక్తివంతంగా, క్షమించేవాడవిగా , నీతిమంతునిగా, దయగలవానిగా, పవిత్రుడవిగా వున్నందుకు ధన్యవాదాలు . మీ స్వభావాన్ని నిర్వచించే లక్షణములలో దయచేసి నన్ను పరిపక్వం చేయండి. నేను స్వనీతిని గలిగినవానిగా ఉండటానికి ఇష్టపడను, కానీ నీతిమంతునిగా ఉండడానికి ఇష్టపడతాను, నేను రౌడీగా ఉండటానికి ఇష్టపడను, కానీ కరుణతో బలంగా ఉండడానికి ఇష్టపడుచున్నాను . నేను దొంగభక్తి గలవానిగా ఉండటానికి ఇష్టపడను, కానీ నిజమైన మరియు దయగలవానిగ ఉండడానికి ఇష్టపడతాను . దయచేసి మీ ఆత్మతో నన్ను నింపండి మరియు పెరుగుదల మరియు మార్పు అవసరమయ్యే రంగాలలో నన్ను సున్నితంగా ఎదుర్కోండి. మీ ప్రతిబింబం ఇతరులు నాలో చూచుదురుగాక . యేసు పేరిట నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు