ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుని కొరకు అత్యవసరంగా జీవించాలనే జ్ఞానము కోల్పోయినప్పుడు, మన సమయాన్ని వృథా చేసుకుంటాము ! దేవుడు మన కొరకు, మన ప్రపంచం కొరకు, మరియు అతని సంఘము కొరకు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. "ఆధ్యాత్మిక అంకగణితం" (మన రోజులను సరిగ్గా లెక్కించడం) యొక్క దేవుని వరము లేకుండా, మనం ఎప్పటికీ జ్ఞాన హృదయాన్ని పొందలేము. కాబట్టి మనకు అలాంటి వరము ఎలా వస్తుంది? సందేహించకుండా దాని కోసం అడగండి (యాకోబు 1: 5-7)! జ్ఞానం కోసం ప్రభువును విశ్వసించడం మనపై మరియు మన జీవితాలఫై చాలా ప్రభావం చూపుతుంది. బలహీన హృదయానికి బదులు, దేవుడు మనకు జ్ఞాన హృదయాన్ని ఇస్తాడు!

నా ప్రార్థన

పవిత్ర మరియు సర్వశక్తిమంతుడైన దేవా, యుగాల రాజా, మీరు మాత్రమే పూర్తి జ్ఞానం, న్యాయం మరియు దయతో జీవిస్తున్నారు. దయచేసి నా జీవితంలో ఏ సమయంలో మరియు నా ప్రయాణంలో ఈ దశలో నేను ఏ పాత్రను పోషించాలనుకుంటున్నానో తెలుసుకోవడానికి నాకు సహాయం చెయ్యండి. నిన్ను మహిమపరుస్తూ నా జీవితం జీవించాలని నేను కోరుకుంటున్నాను. యేసు విలువైన పేరులో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు