ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుడు సృష్టికర్త! జీవితం అతనిలో మరియు అతని ద్వారా నిర్వచించబడింది. స్వర్గం యొక్క జనసమూహం ఆయనను ఆరాధిస్తుంది మరియు మహిమపరుస్తుంది. నాకు ఐతే రెండు చాలా ముఖ్యమైన విషయాలు. మొదట, నేను అతనికి నా హృదయపూర్వక ఆరాధన మరియు ప్రశంసలను ఇవ్వాలి అనుకొవడము . రెండవది, నేను దేవుణ్ణి స్తుతించేటప్పుడు, నేను శాశ్వతమైనదాన్ని చేస్తున్నాను. మీరు మరియు నేను ఈ జీవితంలో ఎక్కువ మొత్తాన్ని తరువాతి కాలంలో తీసుకోని పోలేము ,కాని అలా తీసుకొనిపోయేవాటిలో మన దేవునికి మరియు తండ్రికి మన చెల్లించే మహిమ ఉంది. దేవునికి మహిమ , ఇప్పుడే కాదు,ఎప్పటికీ!

నా ప్రార్థన

ప్రియమైన దేవా, విశ్వం దాని అపారమయిన విస్తారంలో సృష్టించినందుకు ధన్యవాదాలు. పవిత్ర తండ్రీ, క్రీస్తులో నన్ను తిరిగి సృష్టించినందుకు ధన్యవాదాలు, తద్వారా నేను నీ మహిమలో పాలు పంచుకుంటాను. సర్వశక్తిమంతుడైన యెహోవా, శాశ్వతంగా జీవించే జీవితాన్ని సృష్టించినందుకు ధన్యవాదాలు. నిన్ను ముఖాముఖిగా చూసినప్పుడు, పరలోకపు జనసమూహంతో నిన్ను స్తుతిస్తున్నప్పుడు నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. యేసు నామంలో నేను స్తుతిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు